మదనపల్లి బెంగళూరు బస్టాండ్లో జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనుల్లో డిజైన్ లోపం ఉందని ఎమ్మెల్యే షాజహాన్ బాష శనివారం రాత్రి పరిశీలించి తెలిపారు.
మునిసిపల్ కమిషనర్ ప్రమీలతో మాట్లాడి, ప్రస్తుత డిజైన్ వల్ల ప్రజా ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటూ తక్షణమే డిజైన్ మార్చాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో మునిసిపల్ డీఈ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
