Home South Zone Andhra Pradesh అనంతపురం: నంబూరి వైన్ షాప్‌కు నిప్పుపరిస్థితి, జైలుకు తరలింపు |

అనంతపురం: నంబూరి వైన్ షాప్‌కు నిప్పుపరిస్థితి, జైలుకు తరలింపు |

0

జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుపెట్టిన కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్ట్… 14 రోజుల రిమాండ్ … జిల్లా జైలుకు తరలింపు
* ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన

కోనంకి గంగారం, ఇతని డ్రైవర్ వీరేంద్రబాబు మరియు డ్రైవర్ డొక్కా హరి లను అరెస్టు చేసిన నాల్గవ పట్టణ పోలీసులు
* చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎవర్నీ ఉపేంక్షించం… చర్యలు తప్పవు
* చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై గట్టిగా చర్యలు తీసుకోవాలన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ రాష్ట్ర డిజిపి గార్ల ఆదేశాలతో పని చేస్తున్న పోలీసులు

– అనంతపురం నాల్గవ పట్టణ సి.ఐ జగదీష్
12/13.01.2026 తేదీల మధ్య రాత్రి అనంతపురం నగరంలోని నంబూరి వైన్ షాపు యజమానిని బెదిరించి…షాపును ధ్వంసం చేయడంతో పాటు నిప్పంటించి సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం కలిగించారు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన విషయం తెలిసిందే. ఇదే కేసులో… పరారరీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను తాజాగా అరెస్ట్ చేసినట్లు నాల్గవ పట్టణ సి.ఐ జగదీష్ తెలిపారు.

ఈ ముగ్గురికి గౌరవ కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తు ఉత్తర్వులు ఇవ్వడంతో జిల్లా జైలుకు తరలించామన్నారు.
* ప్రస్తుతం అరెస్టయిన నిందితుల వివరాలు:1) కోనంకి గంగారాం, శ్రీనగర్ కాలనీ, అనంతపురము 2) కోనంకి గంగారం డ్రైవర్ అయిన వీరేంద్రబాబు

3) డొక్కా హరి, రుద్రంపేట, అనంతపురం ఈ ముగ్గుర్ని ఈరోజు గౌరవ జడ్జి గారి ముందు హాజరు పరిచామని… ఈ ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ గౌరవ జడ్జి గారు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ ముగ్గురు నిందితులను జిల్లా జైలుకు తరలించామని సి.ఐ తెలిపారు.

NO COMMENTS

Exit mobile version