Home South Zone Andhra Pradesh గణతంత్ర దినోత్సవ వేడుకలను పరిశీలించిన వి విద్యాసాగర్ నాయుడు

గణతంత్ర దినోత్సవ వేడుకలను పరిశీలించిన వి విద్యాసాగర్ నాయుడు

0

కృష్ణాజిల్లా పోలీస్

*గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,*

ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ వి .విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారు ఏ.ఆర్ పోలీస్ పేరేడ్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ రిహార్సల్స్ ను ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, ఇతర పోలీసు అధికారులతో కలిసి వీక్షించారు.

పెరేడ్ కమాండర్ గా అడ్మిన్ ఆర్.ఐ రాఘవయ్య గారు వ్యవహరించారు. ముందుగా ఎస్పీ గారు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకం ఎగుర వేశారు. తరువాత పరేడ్ పరిశీలన వాహనంలో వెళ్లి పోలీసు బలగాల పరేడ్ ను స్వయంగా పరిశీలించారు.

ఈ సంధర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ..*

సివిల్, ఏ‌ఆర్, హోంగార్డ్సు, విద్యార్థుల ప్లటూన్స్ అందరూ చాలా చక్కటి టర్నవుట్ తో పరేడ్ రిహార్సల్స్ బాగా చేశారని పెరెడ్ పై సంతృప్తి వ్యక్తపరిచారు, పెరెడ్ లో పాల్గొంటున్న సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలనతో రిహాసల్స్ లో పాల్గొనాలని, ఈ వేడుకలు గర్వకారణంగా నిలిచేలా ప్రతి అంశాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.

ఇదే స్పూర్తితో రేపు కూడా రెట్టింపు ఉత్సాహంతో పెరేడ్ చేయాలని సూచించారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే అతిధులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాట్లతో భద్రతా పరంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ తగిన భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో బందరు డిఎస్పి సిహెచ్ రాజా గారు, ఏ ఆర్ డి.ఎస్.పి వెంకటేశ్వరరావు గారు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సత్య కిషోర్ గారు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version