పివిపి మాల్ రోడ్ విస్తరణ లో మీ అభిప్రాయాలు తెలపండి
పీవీపీ మాల్ రోడ్ విస్తరణలో తమ అభిప్రాయాలు తెలుపమని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, రోడ్డు విస్తరణలో ప్రభావం అయ్యే నిర్మాణల యజమానులతో అన్నారు. శనివారం ఉదయం నగరపాలక సంస్థ జోనల్ 3 కార్యాలయం లో వారితో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పివిపి మాల్ రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 అడుగుల ఉందని, ప్రస్తుతం ఆ రోడ్డు 50 నుండి 55 అడుగులు ఉందని, మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 అడుగులకు అలైన్మెంట్ చేయగా ఆ రోడ్లో ఉన్న 50 నిర్మాణాలు ప్రభావితం అవుతున్నాయని తెలిపారు. కావున భవన యజమానులు తమ అభిప్రాయాలను తెలపాలని అడిగారు. వారు అభిప్రాయాలు తెలుపగా, ఉన్నత అధికారులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిపారు.
పౌర సంబంధాల అధికారి
విజయవాడ నగరపాలక సంస్థ
