పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న పవన్ కుమార్ రెడ్డి (14) అనే విద్యార్థి అదృశ్యమైనట్లు అతని తల్లి సరోజమ్మ శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గత మూడు రోజులుగా కనిపించకుండా పోయిన బాలుడు రొంపిచర్ల బీసీ హాస్టల్లో ఉంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు# కొత్తూరు మురళి.
