మదనపల్లి మండలం నిమ్మనపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన కార్మికుడు ఉదయ్ సాగర్ (27) తీవ్రంగా గాయపడ్డాడు.
గుండ్ల బురుజుకు చెందిన ఉదయ్ సాగర్, మదనపల్లిలో నిర్మాణ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వృద్ధాశ్రమం వద్ద ద్విచక్ర వాహనం ఢీకొనడంతో కాలు విరిగింది.
అతన్ని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
