Home South Zone Andhra Pradesh చీరాలలో యువకుడి హత్య..! తలకు తీవ్ర గాయం, మెడ చుట్టూ కత్తిపోట్లు

చీరాలలో యువకుడి హత్య..! తలకు తీవ్ర గాయం, మెడ చుట్టూ కత్తిపోట్లు

0

చీరాల:  చీరాల పట్టణంలోని ఆర్ఓబి క్రింద గుర్తు తెలియని యువకుడు మృతదేహం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. అనుమానస్పద స్థితిలో ఉన్న యువకుడి మృతదేహాన్ని బుధవారం వేకువజామున గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మృతిని మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తలకు కూడా తీవ్ర గాయాలు అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటవ పట్టణ ఒన్ టౌన్ సిఐ సుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి దేహాన్ని పరిశీలించారు. సంఘటనా ప్రాంతంలో మద్యం షాపు ఉండటం వలన నిత్యం రద్దీగా ఉంటుంది.

నిత్యం మందుబాబుల హడావిడితో కోలాహలంగా ఉండే ఈ ప్రాంతం ఈ యువకుడి హత్య పట్టణంలో సంచలనంగా మారింది. విషయం తెలిసిన స్థానికులు వందల సంఖ్యలో ఫ్లైఓవర్ వద్దకు చేరుకుని వీక్షిస్తున్నారు. ఘటనా స్థలం రైల్వే శాఖ పరిధిలో ఉండటం వలన కేసు దర్యాప్తును ఎవరు చేపడతారని విషయంలో రైల్వే పోలీసులకు గాని, సివిల్ పోలీసులకు కానీ ఇంకా స్పష్టత రాలేదు.పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

#Narendra

NO COMMENTS

Exit mobile version