AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాంతో అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరగడంతో ఆయన అనుచరులు గుంటూరులోని నివాసం వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
