పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం కోలింపల్లి గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చిన ఒక జింకపై వీధి కుక్కల గుంపు మూకుమ్మడిగా దాడి చేశాయి.
గమనించిన గ్రామస్తులు కుక్కలను తరిమేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే జింక తీవ్రంగా గాయపడి మృతి చెందింది.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వేసవి సమీపిస్తుండటంతో నీటి కోసం జింకలు గ్రామాల వైపు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
