మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పుంగనూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.
చిచ్చిలివారి పల్లి, దేవళంపేట, ఎర్రాతివారి పల్లి, దుర్గంకొండ మరియు నెక్కుంది గ్రామాల్లోని శివాలయాలను ఆయన సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పెద్దిరెడ్డి భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
# కొత్తూరు మురళి.
