Home South Zone Andhra Pradesh మల్లయ్యకొండలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు!

మల్లయ్యకొండలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు!

0

మదనపల్లె మండలంలోని వేంపల్లి మల్లయ్యకొండలో ఆదివారం మహాశివరాత్రి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో కొండ ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమోగింది.

స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం నేత్రపర్వంగా శివపార్వతుల కళ్యాణమహోత్సవం జరిగింది. భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయగా, సాయంత్రం ఉత్సవమూర్తుల గ్రామోత్సవం వైభవంగా సాగింది.

NO COMMENTS

Exit mobile version