పుంగనూరులోని నెక్కొంది కొండపై వెలసిన శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో సుమారు 6 వేల ఏళ్ల నాటి పురాతన శివలింగం ఉందని భక్తుల విశ్వాసం.
అగస్త్య మహాముని స్వయంగా ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. చోళుల కాలంలో నిర్మించిన ఈ ప్రాచీన శైవ క్షేత్రంలో స్వామివారు అగస్తీశ్వరునిగా, అమ్మవారు మీనాక్షిగా పూజలందుకుంటున్నారు. మహాశివరాత్రి వేళ ఈ చారిత్రక ఆలయం భక్తులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
