కాకినాడ జిల్లా ప్రత్తిపాడు హైస్కూల్‌లో ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖాదీ బోర్డు వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, సీహెచ్‌సీ చైర్మన్ వెలుగుల నాని పాల్గొన్నారు.
నులిపురుగుల సమస్య నివారణకు ఈ మాత్రలు ఎంతో అవసరమని వైద్యులు సూచించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగా, ఉపాధ్యాయులు మరియు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షించారు.
#dadala babji
