మంగళగిరి వీవర్స్ కాలనీ హైస్కూల్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సుమారు 800 మంది విద్యార్థులకు మాత్రలు వేసినట్లు తెలిపారు. పిల్లల్లో రక్తహీనత, నీరసం తగ్గించి సంపూర్ణ ఆరోగ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.
