Home South Zone Andhra Pradesh మదనపల్లెలో కొడవలితో యువకుడి హల్‌చల్

మదనపల్లెలో కొడవలితో యువకుడి హల్‌చల్

0

చిన్నారి రిషిక ప్రియ హత్య ఘటనతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న మదనపల్లెలో, బుధవారం మరో కలకలం రేగింది. రామారావు కాలనీ చర్చి వీధి వద్ద ఒక యువకుడు కొడవలి పట్టుకుని రోడ్డుపై వీరంగం సృష్టించాడు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న టూ టౌన్ ఏఎస్ఐ రమణ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. పట్టణంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు.

NO COMMENTS

Exit mobile version