Home South Zone Andhra Pradesh మదనపల్లె ఘటన నిందితుడిని వదిలిపెట్టబోమన్న సీఎం.

మదనపల్లె ఘటన నిందితుడిని వదిలిపెట్టబోమన్న సీఎం.

0

మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి రిషిక దారుణ హత్యపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, చట్టపరంగా అత్యంత కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఫోన్ ద్వారా చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ అమానుష ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత కూడా స్పందిస్తూ, బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

NO COMMENTS

Exit mobile version