మదనపల్లెలో బాలిక హత్య ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు మృతదేహం తరలింపును అడ్డుకున్నారు.
కడప ఎస్పీ నిషికేత్ విశ్వనాథ్ స్వయంగా రంగంలోకి దిగి, నిరసనకారులతో చర్చలు జరిపారు. భారీ పోలీసు బందోబస్తు, తోపులాటల మధ్య పంచనామా ముగించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో పట్టణమంతా పోలీసుల పహారాలో యుద్ధ వాతావరణాన్ని తలపించింది.
