మదనపల్లెలో హత్యాచారానికి గురైన చిన్నారి రిషిక ప్రియ అంత్యక్రియలు రాగిమానిదిన్నెపల్లెలో కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. తన గారాల పట్టిని చూసి తల్లి విలపించిన తీరు స్థానికులను కలిచివేసింది.
అంత్యక్రియలు జరుగుతుండగానే నిందితుడు కులవర్ధన్ చెరువులో శవమై లభ్యమయ్యాడనే వార్త రావడంతో బాధితులకు న్యాయం జరిగిందని స్థానికులు బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు పట్టణంలో భద్రతను పటిష్టం చేసి గాలింపును ముగించారు.
