Home South Zone Andhra Pradesh కోనేరు వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ బిందు మాధవ్ సూచన

కోనేరు వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ బిందు మాధవ్ సూచన

0

సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లను కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదివారం పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు సూచనలు చేశారు.

ముఖ్యంగా పుణ్యస్నానాలు ఆచరించే కోనేరు వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా నియమాలు పాటించాలని కోరారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

NO COMMENTS

Exit mobile version