తునిలోని శ్రీరామ థియేటర్ సెంటర్‌లో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. వృత్తిపరమైన వివాదాల నేపథ్యంలో బైక్ మెకానిక్, సైకిల్ మెకానిక్ నానాజీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం కాకినాడ జిజిహెచ్‌కు తరలించారు.
నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోగా, పాత కక్షలే ఈ దాడికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పట్టపగలే రద్దీ ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
