పుంగనూరులోని టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఆలయ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి, అర్చకులు మంగళవారం దీనికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. 23న అంకురార్పణతో మొదలై మార్చి 4 వరకు ఈ ఉత్సవాలు వైభవంగా సాగుతాయి.
ఈ పది రోజుల పాటు స్వామివారు వివిధ వాహన సేవల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
# కొత్తూరు మురళి .
