Home South Zone Andhra Pradesh పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు బీభత్సం

పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు బీభత్సం

0

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీల పరిధిలో ఒంటరి ఏనుగు ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ప్రతిరోజూ వేకువజామున జనావాసాల్లోకి వస్తున్న ఈ గజరాజు, మామిడి మరియు టమోటా పంటలపై దాడి చేస్తూ రైతులకు అపార నష్టం కలిగిస్తోంది.

దాడి అనంతరం ఏనుగు సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్తోంది. నిత్యం భయం గుప్పిట్లో బతుకుతున్నామని, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగును అడవిలోకి మళ్లించాలని స్థానికులు కోరుతున్నారు.

NO COMMENTS

Exit mobile version