మదనపల్లి కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పాల్గొని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా భూసేకరణ పెండింగ్ పనులు, రీసర్వే రెండు మరియు మూడో దశ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.
స్వామిత్వ పథకం పురోగతితో పాటు ఎన్టీఆర్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
