Home South Zone Andhra Pradesh మదనపల్లెలో ఉద్రిక్తత: ఆందోళనలు చేసిన 50 మందిపై పోలీసుల కేసులు

మదనపల్లెలో ఉద్రిక్తత: ఆందోళనలు చేసిన 50 మందిపై పోలీసుల కేసులు

0

మదనపల్లె నీరుగట్టుపల్లిలో బాలికపై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా అనుమతి లేకుండా ఆందోళనలు చేపట్టిన 50 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారన్న కారణంతో ఈ చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు.

మంగళవారం జరిగిన ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కులసంఘాల నేతలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. పట్టణంలో పరిస్థితి ప్రస్తుతం పోలీసుల నిఘాలో ఉంది.

NO COMMENTS

Exit mobile version