Home South Zone Andhra Pradesh ఏపీలో మహిళలకు రక్షణ కరువు: వైసీపీ నేత నాగమణి ధ్వజం

ఏపీలో మహిళలకు రక్షణ కరువు: వైసీపీ నేత నాగమణి ధ్వజం

0

రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత కరువైందని వైసీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నాగమణి విమర్శించారు. కాకినాడ రూరల్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ..

మదనపల్లె ఘటన ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. గతంలో మహిళల అదృశ్యాలపై గళమెత్తిన నేతలు, ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, తక్షణమే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

NO COMMENTS

Exit mobile version