Home South Zone Andhra Pradesh చొల్లంగి వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం

చొల్లంగి వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం

0

తాళ్లరేవు మండలం చొల్లంగి రోడ్డు పక్కన బుధవారం రాత్రి సుమారు 45 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేపింది. మృతుడి చేతిపై ‘రవికుమార్’, ‘బుజ్జి అమ్మ’ అనే పేర్లతో పచ్చబొట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కోరంగి ఎస్‌ఐ సత్యనారాయణ రెడ్డి కేసు నమోదు చేసి, అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

NO COMMENTS

Exit mobile version