చౌడేపల్లె మండలంలో తక్కువ ధరకు బంగారు కడ్డీల పేరుతో భారీ దోపిడీ జరిగింది. కర్ణాటకకు చెందిన రాజేష్ అనే వ్యక్తికి బంగారం ఇస్తామని నమ్మించి, దుండగులు అతని నుండి ₹15 లక్షలు వసూలు చేశారు.
బదులుగా మట్టి, రాళ్లతో నిండిన సంచిని ఇచ్చి, బాధితుడి సెల్‌ఫోన్‌తో సహా పరారయ్యారు. మోసపోయానని గ్రహించిన రాజేష్ పోలీసులను ఆశ్రయించారు.
ఇలాంటి ఆశచూపే మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
# కొత్తూరు మురళి.
