రాష్ట్ర బడ్జెట్లో ఉపాధి కల్పనకు ప్రాధాన్యత లేదని సీపీఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మండిపడ్డారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు ₹3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న కూటమి ప్రభుత్వం, బడ్జెట్లో ఆ హామీలను విస్మరించిందని విమర్శించారు.
ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయాలని, పరిశ్రమల విస్తరణకు స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
