Home South Zone Andhra Pradesh రబీ సాగుకు జిల్లాకు 1,250 టన్నుల యూరియా చేరిక

రబీ సాగుకు జిల్లాకు 1,250 టన్నుల యూరియా చేరిక

0

రబీ సాగు అవసరాల కోసం కాకినాడ జిల్లాకు బుధవారం 1,250 టన్నుల యూరియా చేరుకున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. విజయ్ కుమార్ తెలిపారు.

ఇప్పటికే జిల్లాలో 4,924 టన్నుల నిల్వలు ఉండగా, త్వరలో మరో 500 టన్నులు రానున్నాయి. రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్ ద్వారా వీటిని పంపిణీ చేస్తారు. ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందకుండా అధికారిక కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు.

NO COMMENTS

Exit mobile version