Home South Zone Andhra Pradesh అంజలి అరెస్ట్‌కు రెండు ప్రత్యేక బృందాలు: డీఎస్పీ |

అంజలి అరెస్ట్‌కు రెండు ప్రత్యేక బృందాలు: డీఎస్పీ |

0

మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న అంజలి (నిందితుడు కులవర్ధన్ తల్లి) కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ ఇప్పటికే చెరువులో మృతి చెందగా, ఈ ఘోరానికి అంజలి సహకరించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆమె ప్రస్తుతం పరారీలో ఉండటంతో బెంగళూరు సహా ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చట్టం తన పని తాను చేస్తుందని, త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

NO COMMENTS

Exit mobile version