Home South Zone Andhra Pradesh మంగళగిరిలో ఆల్ ఇండియా పోలీస్ క్రికెట్ టోర్నీ ప్రారంభం

మంగళగిరిలో ఆల్ ఇండియా పోలీస్ క్రికెట్ టోర్నీ ప్రారంభం

0

మంగళగిరిలో ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టీ-20 టోర్నమెంట్ వైభవంగా ప్రారంభమైంది. హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా క్రీడలను ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 జట్లు పాల్గొంటున్న ఈ పోటీలు ఈ నెల 24 వరకు మూలపాడు స్టేడియంలో జరగనున్నాయి.

పోలీసులు నిత్యం విధుల్లో బిజీగా ఉన్నా, క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. త్వరలో మహిళా పోలీసులకు కూడా ప్రత్యేక స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.

NO COMMENTS

Exit mobile version