Home South Zone Andhra Pradesh ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం యువతకు స్ఫూర్తి: డీఆర్వో

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం యువతకు స్ఫూర్తి: డీఆర్వో

0

బ్రిటిష్ పాలనపై సాయుధ పోరాటం చేసిన తొలి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి వేడుకలను ఆదివారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఆర్వో మధుసూదన రావు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. 1846లోనే ఈస్ట్ ఇండియా కంపెనీని ఎదిరించిన నరసింహారెడ్డి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.

ఆయన త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version