Home South Zone Andhra Pradesh 25న మార్కాపురానికి సీఎం చంద్రబాబు: పల్లా శ్రీనివాసరావు పిలుపు

25న మార్కాపురానికి సీఎం చంద్రబాబు: పల్లా శ్రీనివాసరావు పిలుపు

0

ఈ నెల 25న మార్కాపురం జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకను పురస్కరించుకుని నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోరారు.

సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సీఎం పర్యటనలో వెలుగొండ టన్నెల్ పరిశీలన, ఫీడర్ కెనాల్‌కు శంకుస్థాపన ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టుపై ప్రజలకు ముఖ్యమంత్రి తీపి కబురు అందించనున్నారని వెల్లడించారు.

NO COMMENTS

Exit mobile version