Home South Zone Andhra Pradesh పదవ తరగతి విద్యార్థినులకు పరీక్ష సామాగ్రి పంపిణీ: రేషన్ డీలర్ల ఉదారత

పదవ తరగతి విద్యార్థినులకు పరీక్ష సామాగ్రి పంపిణీ: రేషన్ డీలర్ల ఉదారత

0

మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అన్నమయ్య జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థినులకు పరీక్ష సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో 131 మంది విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు మరియు ఇతర పరికరాలను సివిల్ సప్లైస్ డీటీ ఫిరోజ్ ఖాన్ చేతుల మీదుగా అందించారు. పేద విద్యార్థులకు అండగా నిలిచిన డీలర్ల సంఘం సేవలను పాఠశాల సిబ్బంది అభినందించారు.

NO COMMENTS

Exit mobile version