Home South Zone Andhra Pradesh మా భూమి మాకే కావాలి: మదనపల్లెలో గిరిజన రైతుల ఆందోళన

మా భూమి మాకే కావాలి: మదనపల్లెలో గిరిజన రైతుల ఆందోళన

0

మదనపల్లె నక్కలదిన్నె తండాకు చెందిన సుమారు 39 మంది గిరిజన రైతులు సోమవారం సబ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

చిప్పిలి పాల డైరీ సమీపంలోని 23 ఎకరాల భూమి నాలుగు దశాబ్దాలుగా తమ సాగులో ఉన్నప్పటికీ, ఒక ఎన్ఆర్ఐ (NRI) ప్రభావంతో అధికారులు తమకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేసి, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

NO COMMENTS

Exit mobile version