చీరాలలో ముద్రణ యంత్ర ఆవిష్కర్త జోహన్నెస్ గూటెన్‌బర్గ్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ప్రింటర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ముద్రణ రంగ ప్రతినిధులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, ప్రముఖుల విగ్రహాలకు నివాళులర్పించారు. అక్షరాలు పేర్చే స్థాయి నుంచి ఏఐ (AI) వరకు ఎదిగిన టెక్నాలజీని అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని, అందరూ ఐక్యంగా ఉండి రంగాన్ని అభివృద్ధి చేయాలని సీనియర్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.
#Narendra
