విజయనగరం జిల్లా చీపురుపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్త హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు.
14 ఏళ్లలోపు విద్యార్థినులకు టీకాలు వేయించిన అనంతరం ఆయన వారితో ముచ్చటించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ వ్యాక్సిన్ ఎంతో కీలకమని, దీని డేటాను ‘సంజీవని’ డిజిటల్ రికార్డుల్లో భద్రపరచాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటుకు ధీటుగా ఉండాలని, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని అధికారులకు సూచించారు.
