మదనపల్లె ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.
డాక్టర్ డి. శ్రీహరి, డాక్టర్ టి. భారతి పర్యవేక్షణలో ఎండోస్కోపీ, ల్యాప్రోస్కోపిక్, ఆధునిక దంత చికిత్సలు మరియు జనరల్ సర్జరీలు ఒకే చోట అందుబాటులోకి వచ్చాయి.
24 గంటల అత్యవసర సేవలు, అత్యాధునిక పరికరాలతో నాణ్యమైన వైద్యం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆసుపత్రి పట్టణ వైద్య రంగంలో ఒక నూతన అధ్యాయమని స్థానికులు కొనియాడారు.
