ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల హాజరుపై అత్యంత కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇకపై ఉదయం 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా ‘లేట్’గా పరిగణిస్తారు.
నెలలో కేవలం రెండు సార్లు మాత్రమే 10 నిమిషాల వెసులుబాటు ఉంటుంది. సాయంత్రం నిర్ణీత సమయం కంటే ముందే ‘ఔట్-టైమ్’ వేసినా లేదా నమోదు చేయడం మర్చిపోయినా ఆ రోజంతా గైర్హాజరుగా గుర్తిస్తారు.
సాంకేతిక సమస్యలను పట్టించుకోకుండా తెచ్చిన ఈ నిబంధనలను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
