Home South Zone Andhra Pradesh పుంగనూరు: అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణం

పుంగనూరు: అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణం

0

విజయవాడ ధర్నా చౌక్ లో అనుమతితో నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమని పుంగనూరు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ వైఖరికి నిరసనగా, పుంగనూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పలువురు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి, సిపిఐ నాయకులు వెంకట రమణారెడ్డి, మున్న తదితరులు పాల్గొన్నారు.

# కొత్తూరు మురళి

NO COMMENTS

Exit mobile version