గ్రామాల్లో పాతకాలపు ‘రచ్చబండ’ సంస్కృతిని పునరుద్ధరించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం వృథా చేసుకోకుండా, గ్రామ పెద్దల సమక్షంలోనే వివాదాలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు.
ఉచిత పథకాల కంటే ఉపాధి, విద్యపై దృష్టి సారించాలని మేధావులు సూచిస్తున్నారు. ప్రయోగాత్మకంగా జిల్లాకో గ్రామాన్ని దత్తత తీసుకుని ‘రచ్చబండ’ విధానాన్ని అమలు చేస్తే, మళ్లీ శ్రీరామరాజ్యం సాధ్యమవుతుందని విశ్లేషకుల అభిప్రాయం.
