Home South Zone Andhra Pradesh బాపట్ల సాక్షిగా.. నారీ శక్తి ప్రదర్శన: రక్షణకు రక్షణగా ‘శక్తి’ స్టాల్!

బాపట్ల సాక్షిగా.. నారీ శక్తి ప్రదర్శన: రక్షణకు రక్షణగా ‘శక్తి’ స్టాల్!

0

ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 5 శక్తి బృందాలు నిరంతరం నిర్వహిస్తున్నాయని, ఇప్పటి వరకు 1,078 SOS కాల్స్‌కు వేగంగా స్పందించి సహాయం అందించాయన్నారు. జిల్లాలో 25,507 మంది శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారని, పోక్సో (POCSO) వంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.

మహిళా సంబంధిత 13 కేసులలో నిందితులకు జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు. అందులో 3 లైఫ్, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షలు ఉన్నాయన్నారు. మహిళలకు సురక్షితమైన సమాజాన్ని అందించడమే పోలీస్ శాఖ లక్ష్యమని, ఏ సమస్య ఉన్నా 24 గంటలూ పోలీసులను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు.

NO COMMENTS

Exit mobile version