Home South Zone Telangana ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026: వక్తగా కేటీఆర్ ఎంపిక.

ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026: వక్తగా కేటీఆర్ ఎంపిక.

0

మార్చి 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్’ సదస్సులో ప్రసంగించాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.

‎ఇప్పటివరకు ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి దేశాధినేతలతో పాటు ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, గీతా గోపీనాథ్ వంటి పారిశ్రామిక మరియు ఆర్థిక రంగ నిపుణులు ప్రసంగించారు.

‎ఈ వేదికపై ప్రసంగించిన ప్రపంచస్థాయి దిగ్గజాల సరసన కేటీఆర్ చేరనున్నారు. భారతదేశపు మారుతున్న రాజకీయ, ఆర్థిక ముఖచిత్రంపై కేటీఆర్ తన విశ్లేషణను పంచుకోవాలని ఇండియా టుడే గ్రూప్ కోరింది.

NO COMMENTS

Exit mobile version