విజయవాడలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ హోటల్ & బేకరీ వర్కర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.
గ్యాస్ సిలిండర్ ధర రూ. 3,000 దాటడం మరియు బ్లాక్ మార్కెట్ పెరగడం వల్ల హోటళ్లు మూతబడి వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని సిఐటియు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని, కార్మికులను ఆదుకోవాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. లేనిపక్షంలో ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
