Home South Zone Andhra Pradesh అమరావతిలో ఫిట్స్ పిలాని సందర్శించిన నారా లోకేష్

అమరావతిలో ఫిట్స్ పిలాని సందర్శించిన నారా లోకేష్

0

అమరావతిలో ఏర్పాటు చేయనున్న బిట్స్ పిలాని ఏఐ ప్లస్ (BITS Pilani AI+) క్యాంపస్ నిర్మాణ ప్లాన్లను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఈ క్యాంపస్ వచ్చే ఐదేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో, రెండు దశల్లో 7,000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా నిర్మించనున్నారు.

ఏఐ, రోబోటిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ వంటి నెక్స్ట్ జెన్ కోర్సులతో దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్‌గా ఇది నిలవనుంది. పర్యావరణహిత విధానాలతో నిర్మిస్తున్న ఈ క్యాంపస్‌ను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని మంత్రి లోకేష్ బిట్స్ ప్రతినిధులను కోరారు.

NO COMMENTS

Exit mobile version