మంగళగిరిలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ చేతుల మీదుగా ‘మా ఇంటి పెద్ద కొడుకు’ షార్ట్ ఫిలిం మరియు ‘ఉద్యమి’ లిరికల్ సాంగ్ ఘనంగా ప్రారంభమయ్యాయి. జనసేన పార్టీ సభ్యత్వం యొక్క ప్రాముఖ్యతను, కార్యకర్తల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే భరోసాను ఈ చిత్రం ఎమోషనల్‌గా ఆవిష్కరించింది.
నిర్మాత జొన్న రాజేష్, దర్శకుడు గాదె నాగభూషణం ప్రతిభను ఎమ్మెల్సీ ప్రత్యేకంగా ప్రశంసించారు. నటుడు పార్ధసారధి నటన, రమణ రాసిన లిరిక్స్ మనసును హత్తుకున్నాయని ఆయన పేర్కొన్నారు. చిల్లపల్లి శ్రీనివాసరావు సారథ్యంలో రూపొందిన ఈ చిత్ర యూనిట్‌ను హరిప్రసాద్ అభినందిస్తూ, దీనిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు.
