Home South Zone Andhra Pradesh క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ప్రథమ స్థానం అవార్డు సాధించిన పోలీస్ అధికారులు

క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ప్రథమ స్థానం అవార్డు సాధించిన పోలీస్ అధికారులు

0

నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ప్రకాశం జిల్లా పోలీసులకు ప్రతిష్టాత్మక “అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ABCD)” లభించింది.

మద్దిపాడులో జరిగిన బాలిక హత్య మరియు అత్యాచారం కేసును సాంకేతిక ఆధారాలతో ఛేదించి, నిందితులను అరెస్ట్ చేసినందుకు ఈ అవార్డు దక్కింది. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు మరియు ఇతర అధికారులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పోలీసుల కృషిని డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు.

NO COMMENTS

Exit mobile version