Home South Zone Andhra Pradesh ఏపీ విద్యార్థులకు ఊరట.. ఫీజు బకాయిలకు లైన్ క్లియర్.

ఏపీ విద్యార్థులకు ఊరట.. ఫీజు బకాయిలకు లైన్ క్లియర్.

0

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊరటనిచ్చారు. నిలిచిపోయిన రూ.1,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గతంలో అధికారులు ప్రతిపాదించిన 7.5% వడ్డీ కోతను సీఎం పూర్తిగా తిరస్కరించారు. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో, ఎటువంటి కోతలు లేకుండా నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. దీనిలో భాగంగా తొలి విడతగా రూ.300 కోట్లు విడుదలయ్యాయి. మిగిలిన రూ.900 కోట్లను ఉగాది నాటికి జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

NO COMMENTS

Exit mobile version