ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఐడీఏలో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (DRI) అధికారులు వెలికితీశారు. ఒక ఫ్యాక్టరీలో రహస్యంగా తయారు చేస్తున్న 200 కేజీల అల్ప్రాజోలమ్ను స్వాధీనం చేసుకున్నారు, దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 47 కోట్లు.
హైదరాబాద్ నుండి ముడి సరుకు తెప్పించి, ఫార్మా రంగంలో అనుభవం ఉన్న వ్యక్తులే ఈ అక్రమ దందా నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా, భారీగా కెమికల్స్ మరియు డ్రగ్ తయారీ యంత్రాలను అధికారులు సీజ్ చేశారు.
