Home South Zone Telangana షాలోమ్ చర్చి సేవలు అభినందనీయం – అనిల్ కిషోర్ గౌడ్.|

షాలోమ్ చర్చి సేవలు అభినందనీయం – అనిల్ కిషోర్ గౌడ్.|

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భూదేవినగర్: స్థానిక షాలోమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి ఆధ్వర్యంలో ఆనంద్ పర్యవేక్షణలో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా స్థానికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ (BRS) నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు.
శిబిరంలో డాక్టర్ మైఖేల్, డాక్టర్ సుప్రియ, డాక్టర్ రూహీ, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ శేఖర్ గౌడ్, డైటీషియన్ ఎం. షిర్లీ లిలియన్ తదితర వైద్య బృందం రోగులను పరీక్షించి తగు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో విజయ్ శేఖర్, వెంకటేష్ మరియు ఇతర ముఖ్యులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.
#sidhumaroju
Alwal

NO COMMENTS

Exit mobile version